మంచిర్యాల, మహా :దేశంలో విద్యావంతులను తయారుచేసిన గొప్ప పాత్ర ఉపాధ్యాయులదని మంచిర్యాల జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ భాస్కర్,
ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య లు కీర్తించారు. మంచిర్యాల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో బుధవారం రాత్రి ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, జిల్లాలోని అన్ని మండలాల మండల విద్యాశాఖ ఆదికారులకు గురు బ్రహ్మ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వారితో పాటు మంచిర్యాల జిల్లా డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సంతోష్ కుమార్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కోట ఇనిస్టిట్యూట్ డి. అంజి రెడ్డి లు పాల్గొన్నారు. అనంతరం
వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సంఘంలో దాదాపు 150 పాఠశాలల సభ్యత్వం ఉండగా అందులో 120 పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా గురు బ్రహ్మ అవార్డు తో సన్మానించినట్లు వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా ట్రస్మా ప్రైవేటు ఉపాధ్యాయులకు విద్యా పురోగతి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు.
నేడు రాష్ట్రంలో దేశంలో విద్యావంతులను తయారుచేసిన గొప్ప పాత్ర ఉపాధ్యాయులదని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వృత్తిలో ఉన్న ఉపాధ్యాయ లోకానికి తన వంతుగా సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ట్రస్మా చేస్తున్న కృషిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణువర్ధన్ రావు, సురభి శరత్ కుమార్, యార్లగడ్డ బాలాజీ, రాం వేణు, అఖిలేందర్ సింగ్, బద్ధం పురుషోత్తం రెడ్డి, డేనియల్ రాజ్, జిల్లా గౌరవ అధ్యక్షురాలు గోనె భాగ్యలక్ష్మి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు కొమ్ము దుర్గాప్రసాద్, వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు పాల్గొన్నారు.






