Mahaa Daily Exclusive

  శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు ప్ర‌శాంతంగా నిర్వ‌హించుకోవాలి నిర్వాహ‌క క‌మిటీల‌తో ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ స‌మ‌న్వ‌య స‌మావేశం మండ‌ప నిర్వాహ‌కుల‌కు ప‌లు సూచ‌న‌లు ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఈనెల 22 నుండి ప్రారంభమవుతున్నభక్తిశ్రద్ధలతో ప్ర‌శాంతంగా దుర్గా , శార‌దా శరన్నవరాత్రులు నిర్వహించుకోవాల‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్అన్నారు. గురువారం ప‌ట్ట‌ణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మండ‌పాల‌ నిర్వాహ‌కులు హిందూ సంఘాల‌ ప్ర‌తినిధుల సమన్వయ సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలకు జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో డీజే లకు అనుమతులు లేవ‌న్నారు.మండప నిర్మాణంలో నాణ్యమైన వస్తువులను, కర్రలను, వైర్లను వినియోగించాలని సూచించారు.మండపాల వద్ద రాత్రి సమయాలలో నిర్వాహక కమిటీ సభ్యులు నిద్రించేలా చూసుకోవాల‌ని సూచించారు. సుప్రీంకోర్టు నియమ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో డీజే లకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. వర్షాల కార‌ణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలను చేపట్టాలని సూచించారు. గ‌ణేష్ నవరాత్రి ఉత్సవాలలో మాదిరిగా పటిష్టమైన పోలీసు బందోబస్తు సెక్టార్లవారిగా, క్లస్టర్ల వారిగా విభజించి ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. ఈవ్ టీజింగ్ జరగకుండా పట్టణంలోని మండపాల వద్ద షీ టీం పర్యవేక్షించనున్న‌ట్టు తెలిపారు. అర్థరాత్రి వరకు సౌండ్ బాక్సుల్లో పాట‌లు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించ‌వ‌ద్ద‌ని సూచించారు. ఈ శరన్నవరాత్రులు గతంలో మాదిరిగానే భక్తిశ్రద్ధలతో సాంప్రదాయాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపల్లి హనుమాన్లు, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె ఫణిదర్, డి సాయినాథ్, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest