మునుగోడు, మహా
రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని ఇలా రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పానని రాజ్ గోపాల్ రెడ్డి వివరించారు. అలా చెప్తే తప్పేంటి? ఇప్పుడు కూడా ఓ ప్రైవేటు కార్యక్రమానికి గుంటూరు వెళ్తుంటే.. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని రూమర్స్ పుట్టిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతానన్నారు. అప్పటి వరకు ఈ దుష్ప్రచారాలు నమ్మొద్దని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా రాజగోపాల్ రెడ్డి 70కి పైగా వాహనాల కాన్వాయ్ తో ఏపీకి వెళ్ళడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.






