Mahaa Daily Exclusive

  తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేసుకోవాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ..!

Share

హైదరాబాద్, మహా: తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు బతుకమ్మ పండుగను రాజకీయం చేశారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. వివిధ రకాల పాటలతో బతుకమ్మను రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మొదటిరోజు చేసుకునే ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గరి నుంచి చివరి సద్దుల బతుకమ్మ వరకూ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు. బతుకమ్మ పండుగపై కొన్ని అపోహలు ఉన్నాయని మహేష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ తెలంగాణ పండుగ.. తెలంగాణ సంప్రదాయమని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్లీ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Latest