ఆదిలాబాద్ మహా : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆకాంక్షలకనుగుణంగా నడుచుకోవలసిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రం లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ లో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిగా బతికిన మహనీయుడు కొండాలక్ష్మన్ బాపూజీ అని కొనియాడారు. తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని తృణప్రాయంగా భావించి త్యజించిన గొప్ప తెలంగాణ త్యాగశీలి అని అన్నారు. ఆయన ఆకాంక్షలమేరకు సాధించిన తెలంగాణలో మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందన్నారు.
Post Views: 16






