మందమర్రి, మహా : మందమర్రిలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి మహిళల పక్షపాతిగా వ్యవహరించిందని అన్నారు. డ్వాక్రా గ్రూపుల ఏర్పాటు తెలుగుదేశం ఆధ్వర్యంలోనే జరిగిందని వెల్లడించారు. తన శక్తి మేరకు చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ మహిళలకు చేనుల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, మహిళ పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య, గౌరవ అధ్యక్షురాలు జయ (సుకన్య), సామ కవిత, సుగుణ, భాగ్య, కారం రాజు, ఒడ్నాల సత్యనారాయణ పారిపల్లి శ్రీను, రాజేష్ లు ఉన్నారు.
Post Views: 70






