ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బేల మండలం మసాల బీ గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహ పరిచారు. అంతకు ముందు గ్రామానికి చెందిన పలు సమమ్యలపై చర్చించారు. ఏసమస్య వచ్చినా గ్రామస్తులకు తాను అండగా ఉంటానని కంది శ్రీనివాస రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్,డైరెక్టర్ మడావి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సామా రూపేష్ రెడ్డి,ఠాక్రె అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఘన్శ్యామ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు విట్టల్ దేవతడే,నానాజీ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రె అశోక్ పాటిల్,సుదాం రెడ్డి, బండి సుదర్శన్, ఇట్టడి రాజా రెడ్డి,బండి నందు, రమేష్ పాటిల్, బొక్రె శంకర్,వాంఖడే రుప్ రావ్, విపిన్ ఠాక్రె, ఈశ్వర్ దొటే, తదితరులు పాల్గొన్నారు.






