ఆదిలాబాద్ మహా : తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని బేలా మండలం లోని పలు గ్రామాలకు చెందిన గోవారి కులస్తులు కోరుతున్నారు.ఆదివారం బేల మండలంలోని మసాల బీ గ్రామంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఎన్నోఏళ్లుగా ఇక్కడే గోండ్ ఆదివాసీలతో కలిసి నివాస ముంటున్న తమను ఎస్ టి జాబితాలో చేర్చాలని కోరుతూ కంది శ్రీనివాస రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్,డైరెక్టర్ మడావి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సామా రూపేష్ రెడ్డి,ఠాక్రె అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఘన్శ్యామ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు విట్టల్ దేవతడే,నానాజీ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రె అశోక్ పాటిల్,సుదాం రెడ్డి, బండి సుదర్శన్, ఇట్టడి రాజా రెడ్డి,బండి నందు, రమేష్ పాటిల్, బొక్రె శంకర్,వాంఖడే రుప్ రావ్, విపిన్ ఠాక్రె, ఈశ్వర్ దొటే, తదితరులు పాల్గొన్నారు.






