ఆదిలాబాద్ మహా: ఆరోగ్యం మహాభాగ్యమని మానసిక ,శారీరక ధృడత్వానికి జిమ్ చేయడం ఎంతో అవసరమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని రాంనగర్ లోని ఇంపాక్ట్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ను ఆయన సందర్శించారు. యజమానూలు షాకీర్, జీషాన్ లకు అభినందనలు తెల్పుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం జిమ్ లోని వ్యాయామ పరికరాలను పరిశీలించారు. జిమ్ సెంటర్ ట్రైనర్ ఆయనకు అన్ని వివరించారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,ఇమ్రాన్ , గుడిపెల్లి నగేష్, గిమ్మ సంతోష రావు, కోలా నరసింహులు, షేఖిల్,ఖలీం, అర్ఫాత్ ఖాన్, సలీం, శరత్, నరేష్..తదితరులు పాల్గొన్నారు.
Post Views: 46






