బెల్లంపల్లి,మహ: మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన నిర్వహించడం బెల్లంపల్లి మండలం
లోని బట్వాన్ పల్లి గ్రామంలో చోటు
చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం నకిలీ పత్రాలను చూపించి భూమిని అమ్మకానికి పెట్టడంతో మంథని మం
డలానికి చెందిన వడ్డెర కులస్తులు ఆదివారం రాత్రి బెల్లంపల్లి మండలం
లోని బట్వాన్ పల్లి గ్రామంలో వారిని మోసం చేసిన వ్యక్తుల ఇండ్ల ఎదుటన నిరసను చేపట్టడం చర్చనీయాంశమైం
ది.తాండూర్ మండలంలో 12 ఎకరా
ల భూమిని నకిలీ పత్రాలు చూపించి బాధితుల వద్ద నుంచి 45 లక్షలు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నా
రని ఆరోపించారు. డబ్బులు చెల్లించి రెండు నెలలు గడుస్తున్నా భూమిని అమ్మకానికి పెట్టిన వ్యక్తులు రిజిస్ట్రేష
న్ కు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత భూమికోసం ఇచ్చిన నగదును తమకు చెల్లించాలని లేనిపక్షంలో భూమినైన ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.








