మందమర్రి, మహా : సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) తో సోమవారం మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ అధ్యక్షతన అధికారుల బృందం స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ గుర్తింపు సంఘం యూనియన్ ప్రతినిధులతో 10 వ స్ట్రక్చర్ నిర్వహించినట్లు తెలిపారు.
సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి ఉత్పాదకత లో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనదని వివరించారు. అంతే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఎక్కువ ప్రదాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. గడిచిన సమావేశంలో జరిగిన పనుల యొక్క పురోగతి గురించి చర్చించామన్నారు. ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు వెంకటస్వామి, అక్బర్ అలీ, దాగం మల్లేష్, ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కే.కే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకే ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఐఈడి (ఎస్సి) కిరణ్ కుమార్,ఏరియా స్టోర్స్ డీ.జీ.ఎం ఈ అండ్ ఎం సురేష్,సివిల్ ఎస్.ఇ రాము,డి.వై.పి.ఎం సందీప్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి,
సుదర్శన్,సి.వి రమణ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.






