Mahaa Daily Exclusive

  సరస్వతీమాతగా శ్రీ భద్రకాళి అమ్మవారు ..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్
మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరించి పూజారాధనలు జరిపారు. సోమవారం అమ్మవారు సాధకుడి బుద్దిలోకి ప్రవేశిస్తుంది. సరస్వతీ మాతగా అలంకరింపబడిన అమ్మవారి దర్శనంతో సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. అమ్మవారికి ఉదయం భద్రపీఠ సేవ, సాయంకాలం అశ్వవాహన సేవ – నిర్వహించారు. మంగళవారం భద్రకాళి అమ్మవారి జాన్మోత్సవం. దుర్గ భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెందిన రోజు కాబట్టి బతుకమ్మ కూడా దుర్గాష్టమినాడే జన్మించిందని ఆనాడే చద్దులు చేయడమనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి, సహాయ కమిషనర్ రామల సునీత తెలిపారు.

Latest