బూర్గంపహాడ్ మహా:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరంలో విజయదశమి పర్వదినమున బాబా వారి పుణ్య తిది సందర్భంగా బుధవారం సాయంత్రం 7:00 నుండి గురువారం ఉదయం ఐదు గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అఖండ నామ సంకీర్తన భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది గురువారం ఉదయం ఐదు గంటల 15 నిమిషాలకు బాబా వారికి కాకడ హారతి,ఉదయం 6 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, నూతన వస్త్రాలంకరణ ,భక్తులచే గోత్రనామ అష్టోత్తరక పూజలు కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ బాబా వారి పూజా కార్యక్రమాలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, బాబాని నమ్ముకుంటే ఎలాంటి కష్టాలు దరిచేరవని ,కోరిన కోరికలు అన్ని తీరుతాయని అన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు ,ఆలయ కమిటీ సభ్యులు ,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు






