ఆదిలాబాద్ మహా: మాజీ మంత్రి, సూర్యపేట నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన జిల్లాలో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవచేసారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి , కాంగ్రెస్ శ్రేణులతో కలిసి దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారని ఆయన లేని లోటు తీర్చలేనిన్నారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, సీనియర్ నాయకులు గిమ్మసంతోష్, కొండ గంగాధర్, మునిగెల విఠల్, ఏవన్,భూపెల్లి శ్రీధర్, గుడిపల్లి నగేష్, శాంతన్ రావు, సాయిచరణ్ గౌడ్ ,బండారి సతీష్, సందా నర్సింగ్, పోరెడ్డి కిషన్, రాజేశ్వర్ శ్రీలేఖ,సుధాకర్ గౌడ్, ఎంఏ షకీల్, కొండూరి రవి,అల్చెట్టి నాగన్న, రఫీక్, తదితరులు పాల్గొన్నారు.






