భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని, భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదని ఆయన అన్నారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. దక్షిణ రష్యాలోని సోచిలో జరిగిన అంతర్జాతీయ వాల్డాయ్ చర్చా వేదికలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Post Views: 25






