Mahaa Daily Exclusive

  రేపు ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి రూ.15,000..!

Share

AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయనుంది. ఒక్కో డ్రైవర్ అకౌంట్లోకి రేపు (శనివారం) రూ.15,000 జమ చేయనుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుంది. కాగా, మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా తమకు నష్టం వస్తోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించారు. దాంతో సీఎం చంద్రబాబు ఆర్థికసాయం అందిస్తామని అనంతపురంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు.

Latest