AP: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈదురుగాలులకు రోడ్ల మీద పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Post Views: 72







