Mahaa Daily Exclusive

  ఉత్తరాంధ్రలో ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం..!

Share

తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని తీరప్రాంతాల్లో గంటకు 50 – 70 కిమీ వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులను రెండు రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.