- మందమర్రి మండలంలో ఖాళీ కుర్చీల దర్శనం
- ఉదయం 11,30 నిమిషాలైన ప్రారంభం కాని వైనం
మందమర్రి, మహా : మందమర్రి మండల కేంద్రంలో తూ తూ మంత్రంగా ప్రజావాణి కార్యక్రమం అమలవుతోంది. ప్రతి సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల అభివృద్ధి కార్యాలయాల వరకు ప్రజల ఆర్జీలు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదులు (ప్రజావాణి) విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ నిర్వహణ అధికారులు ఆ మాటలు విడిచేవిన పెట్టినట్లు అర్థమవుతుంది. సోమవారం మందమర్రి మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం ఉదయం 11:30 అయినా ప్రారంభం కాకపోవడం గమనార్హం. సదర్ కార్యాలయానికి మహా దిన పత్రిక ప్రతినిధి వెళ్లగా ఖాళీ కుర్చీలతో దర్శనం ఇచ్చింది. ఈ సమావేశానికి 21 మంది వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రావాల్సి ఉండగా కేవలం 8 మంది మాత్రమే హాజరు కావడం పట్ల పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మందమర్రిలో ఇచ్చిన పలు ఆర్జీదారుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మండల ప్రజలు ఫిర్యాదులు చేయడం లేదని సమాచారం. ఈ విషయంపై జిల్లా సంబంధిత ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే.






