Mahaa Daily Exclusive

  జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక: కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రాజాసింగ్ – “ఎన్ని ఓట్లతో ఓడిపోతారు?” అని ఘాటు ప్రశ్న!

Share

  • జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక
  • కిషన్ రెడ్డి టార్గెట్ గా రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
  • పార్టీ నుంచి వెళ్ళినా బీజేపీని వదలని ఎమ్మెల్యే
  • ఎన్ని ఓట్లతో ఓడిపోతారని కేంద్ర మంత్రికి ప్రశ్నలు

హైదరాబాద్, మహా : రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ అగ్గి రాజుకుంటున్నాయి. గత కొన్నాళ్ళుగా బీజేపీకి కొరకరాని కొయ్యలా తయారైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి తన మాటల తూటాలు వదిలారు. ‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా సోషల్ మీడియాలో మీకు జనాలు క్వశ్చన్ అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది.’ అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర అధికారులకు మల్లా మీ ముఖం ఎట్లా చూపెడతారు.. కొద్దిగా ఆలోచన చేసినారా మా సారు. ప్రతి ఒక్క పార్లమెంట్ లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క డివిజన్ లో వేలు పెట్టే అలవాటున్న మీకు ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.’ అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక కోసం సన్నద్దమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేకెత్తిస్తున్నాయి.

Latest