Mahaa Daily Exclusive

  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన …మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Share

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
  • మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ ఆరోపణలు
  • కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలతో పోలీస్తే ఓ అడుగు ముందే ఉంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత బరిలో దిగింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సునీతతో పాటు ఆమె కుమార్తె మాగంటి అక్షర సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో మాగంటి సునీత, ఆమె కుమార్తెకు ఊహించని షాక్ తగిలింది. వారిద్దరి మీద కేసు నమోదయ్యింది. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తెల మీద కేసు నమోదయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వారిపై కేసు నమోదు చేశారు. మాగంటి సునీత, ఆమె కుమార్తె ఇద్దరూ.. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి చర్యలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో మాగంటి సునీత, ఆమె కుమార్తెలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్‌ పటేల్‌తో పాటు మరో నలుగురి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వీరందరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ లీడర్లు అంజద్ అలీఖాన్, ఆజం అలీ, షఫీ, ఫయీం వంటి వాళ్లు.. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద బీఆర్ఎస్ పార్టీ కండువాలు ధరించి చేతిలో కరపత్రాలతో కనిపించారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. దీని గురించి సమాచారం అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె, ఇతర బీఆర్ఎస్ నాయకులు చేతిలో కార్డులు పట్టుకుని, ప్రార్థనలు చేసుకుని వస్తున్న వారిని తమ మాటలతో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, మతపరమైన ప్రదేశాలలో రాజకీయ ప్రచారాలు చేయకూడదని ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీని ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మసీదు వద్దకు వెళ్లి ప్రచారం చేసినందుకు మాగంటి సునీతను ఏ1గా, ఆమె కూతురు మాగంటి అక్షరను ఏ2గా, మరికొంతమందిని చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని వారిపై ఆరోపణలున్నాయి.

Latest