Mahaa Daily Exclusive

  గూగుల్‌ డేటా సెంటర్‌తో ఏపీకి రూ.10 వేల కోట్ల ఆదాయం :కేంద్రమంత్రి పెమ్మసాని

Share

ఢిల్లీ, మహా
విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇతర సంస్థలూ విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్‌.. విశాఖకు రావడానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ విశేషంగా కృషి చేశారని చెప్పారు. విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో ఇవాళ చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్‌ సుమారు 15 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.

Latest