Mahaa Daily Exclusive

  మంత్రులంతా రాజీనామా!..గుజరాత్ కేబినెట్ సంచలన నిర్ణయం

Share

  • మంత్రులంతా రాజీనామా!
  • గుజరాత్ కేబినెట్ సంచలన నిర్ణయం
  • మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుగా నిర్ణయం
  • నేడు కొలువుదీరనున్న నూతన మంత్రివర్గం

గుజరాత్‌, మహా: గుజరాత్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే రాజీమానా చేయలేదు. మంత్రివర్గంలో ఏకైక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. గురువారం సాయంత్రం సీఎం నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. మంత్రులందరిని వ్యక్తిగతంగా వారు కలిశారు. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని వివరించి వారి నుంచి రాజీనామాలు స్వీకరించారు.

కొత్త మంత్రివర్గం ఏర్పాటు..
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుజరాత్ కొత్త మంత్రివర్గం ఏర్పడనున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. మరోవైపు ఐదారు మంది మంత్రులకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తున్నది. మిగిలిన పదవులను కొత్తవారితో భర్తీ చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడం, ప్రభుత్వంలో కొత్త శక్తిని నింపేందుకు బీజేపీ విస్తృత వ్యూహంలో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి

Latest