Mahaa Daily Exclusive

  కరెప్షన్ కు కేరాఫ్ కాంగ్రెస్…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్

Share

  • కరెప్షన్ కు కేరాఫ్ కాంగ్రెస్
  • మంత్రి కుటుంబ ఆరోపణలపై విచారణ జరపాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్

హైదరాబాద్, మహా : డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రాషఅట్ర ప్రభుత్వంలోని పెద్దలు కొందరు బెదరింపులకు దిగారంటూ మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన పార్టీ చీఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘పోలీసులు ఓ మంత్రి ఇంట్లోకి వెళ్ళారు. మంత్రి కూతురు.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారు. సిమెంట్ కంపెనీల యజమానులను బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కరెప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలి. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోంది. టికెట్‌లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై పాలక పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. గత ప్రభుత్వం దోచుకున్న సొత్తు పంచుకుంటున్నారని.. ఇప్పుడు దోచుకున్న సొత్తు పెంచుకునేందుకు తప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణను దోచుకున్న పార్టీలను ఓడించాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ డీఎన్ఏ.. అవినీతి, తప్పుడు పాలన, దోపిడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిమెంట్ కంపనీ యాజమాన్యాన్ని బెదరించిన వారిలో సీఎంకు అత్యంత సన్నిహితులున్నారని, వారిపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశ వ్యాప్తంగా వేర్వరు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచి పెట్టేందుకు దోపిడీకి తెరలేపిందని దుయ్యబట్టారు. ప్రజా పాలన అందిస్తున్నామంటున్న కాంగ్రెస్ పార్టీ బెదరింపులకు దిగుతూ అందినంత దండుకుంటుందన్నారు. మంత్రి కుటుంబమే అవినీతి ఆరోపణలను చేసిందంటే పాలక పక్షం దోపిడీ ఏ మేరకు ఉందో ప్రజలు గుర్తించాలన్నారు

Latest