- బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని అభ్యంతరాలు
హైదరాబాద్, మహా: బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదు అని, బిగ్ బాస్ టీం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటుందని ఫిర్యాదులో ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది వారు ఫిర్యాదులో అభ్యంతరాలు లేవనెత్తారు. సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చేయాలన్నారు. సీనియర్ హీరో నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరారు







