- హస్తమిచ్చిన పంతంగి
- ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు
- బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది: అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ తమ మద్దతు ప్రకటించింది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నవీన్ యాదవ్‌తోపాటు ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఆయనను కలిశారు. అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3.9 లక్షల మంది ఓటర్ల సెంటిమెంట్, కేవలం ఒక్క అభ్యర్థి సెంటిమెంట్ కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో పూర్తిగా విఫలమైంది. వారు 10 సంవత్సరాలు వృధా చేశారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కానీ జూబ్లీహిల్స్‌లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు-. ఎంఐఎ జూబ్లీహిల్స్‌లో పోటీ చేయదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37 శాతం ఓట్ల వాటా వచ్చిందని, 5 నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వాటా 15 శాతానికి పడిపోయిందని ఓటర్లు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది. తెలంగాణలో బీజేపీ వృద్ధిని ఆపాలని ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు







