Mahaa Daily Exclusive

  బొబ్బిలిలో 70 అనధికార లేఅవుట్లకు ఐపీఎల్పి ఆమోదం… మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి

Share

విజయనగరం జిల్లా.మహా:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( ఎల్ఆర్ఎస్ ) కింద అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలో 70 అనధికార లేఅవుట్లు గుర్తించ బడ్డాయని మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి ప్రకటనలో పేర్కొన్నారు వాటిని ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ ( ఐ పి ఎల్ పి ) గా ఆమోదించారు.అయితే ఆమోదించబడిన లేఅవుట్లకు చెందిన పలువురు ప్లాట్ యజమానులు ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు సమర్పించలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆమోదం పొందిన ఐపీఎల్ వివరాలు ప్రతి సచివాలయం పరిధిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.రెగ్యులరైజేషన్ చేయని వారు భవన అనుమతుల సమయంలో 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు మరియు 33 శాతం పెనలైజేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 33 శాతం పెనలైజేషన్ చార్జీలు మాఫీ చేయబడగా, ఓపెన్ స్పేస్ చార్జీలపై 50 శాతం రాయితీతో కేవలం 7 శాతం మాత్రమే చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించబడిందని పురపాలక సంఘం అధికారులు తెలిపారు. కావున బొబ్బిలి పురపాలక పరిధిలో గల భవన యజమానులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు

Latest