Mahaa Daily Exclusive

  బీసీ బంద్.. దిల్‌సుఖ్‌ నగర్‌లో ఉద్రిక్తత

Share

హైదరాబాద్, మహా: 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాయి. దిల్‌సుఖ్ నగర్‌లో బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్ డిపోల ఎదుట, రోడ్లపై బైఠాయించి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పలు ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు వారిని వారించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, బీసీ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది