Mahaa Daily Exclusive

  వన్ ఇయర్‌లో 60 వేల ఉద్యోగాలిచ్చినం ..త్వరలోనే గ్రూప్ -3, గ్రూప్-4 ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Share

  • వన్ ఇయర్‌లో 60 వేల ఉద్యోగాలిచ్చినం
  • త్వరలోనే గ్రూప్ -3, గ్రూప్-4 పూర్తి చేస్తాం
  • తల్లిదండ్రులను విస్మరిస్తే అధికారుల జీతం కట్ చేస్తాం
  • మిమ్మల్ని భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు
  • ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, మహా: తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులందరిపైనా ఉందని, అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సలహాదారులు, ప్రజా ప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. దీపావళి పండుగ శుభవేళ ఉద్యోగ నియామక పత్రాలను అందుకుంటున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యాలను నిర్ధేశించామని ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ‘మనిషి జీవితంలో జన్మదినం ఎంత ముఖ్యం, ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు. ఈరోజు అందుకోబోయే నియామక పత్రం జీవితంలో ఒక భావోద్వేగం. ఈరోజు నుంచి మీరంతా బాధ్యత కలిగిన అధికారులు. ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కాపాడుకుంటూ ముందుకు సాగాలి.