Mahaa Daily Exclusive

  కేటీఆర్.. కడుపుకు అన్నం తింటున్నావా?ఇదిగో ఆధారాలు.. సమాధానం చెప్పు

Share

  • కేటీఆర్.. కడుపుకు అన్నం తింటున్నావా?
  • నిజాయితీగా పనిచేస్తే బట్ట కాల్చి మీదేస్తారా?
  • అవినీతి.. నిర్లక్ష్యపు అధికారిని వెనకేసుకొస్తారా?
  • ఇదిగో ఆధారాలు.. సమాధానం చెప్పు
  • రెండేళ్ళుగా ఆయన మీ పాపాలనే మోస్తున్నాడు
  • రిజ్వీతో సర్కారుకు రూ.230 కోట్ల నష్టం.. అఖిల భారత సర్వీస్ రూల్స్ నూ ధిక్కరించాడు
  • ఆయన నిర్లక్ష్యపు పనిపై.. ఏడాదికాలంలో ఉన్నత అధికారులకు అనేక లేఖలు రాశా
  • లిక్కర్ దందాకు పేటెంట్ కల్వకుంట్ల కుటుంబమే.. ముఖ్యమంత్రిపై, మా పై నిందలు వేస్తారా?
  • తప్పు చేయను.. నీతి తప్పను.. మీలాగా కాదు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలనం

హైదరాబాద్, మహా
కేటీఆర్ కడుపుకు అన్పం తింటున్నావా? నిజాయితీగా పనిచేసే నాపై జూబ్లీహిల్స్ ఎన్నికలున్నాయని బట్టకాల్చి మీదేస్తారా? ఆరోపణలు చేయడానికి మనస్సాక్షి.. సిగ్గు ఉండాలి కదా? మీరు చెప్పే నిజాయితీ గల అధికారి రెండేళ్ళుగా ఏ నిర్వాకాలు చేశారో మీకు తెలుసా? హోలోగ్రామ్ కారణంగా నకిలీమద్యానికి ఆస్కారం ఉండడంతో నామినేషన్ పద్దతిపై స్వంత నిర్ణయాలతో ఏడాదికి 40కోట్ల టెండర్లను కొనసాగిస్తున్న విఫయం తెలుసా? ప్రభుత్వ ఆదేశాలు, చర్యలన్నీ తొక్కిపెట్టి.. అఖిల భారత సర్వీసు రూల్స్ నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన విషయం మీకు తెలుసా? రిజ్వీ అనేక తప్పిదాలకు పాల్పడ్డాడు. డిస్టిలరీల విషయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి ఏడాదికి రూ.230కోట్ల నష్టం వాటిల్లింది. ఇంకా నష్టం జరుగుతోంది. ఒకటి కాదు.. పదుల నిర్లయాలు ప్రజాధనానికి గండిపెట్టినవి.. పాత ప్రభుత్వంలోని దందాలు కొనసాగించినవి అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాం నాయక్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రిజ్వీ పనితీరుపై గత ఏడాది ఆగస్టు నుండి లేఖలు రాస్తున్నానని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని, కమిటీ వేసి ఛైర్మన్ పదవి అప్పగించినా ఏనాడూ విధులు నిర్వర్తించలేదన్నారు. అలాంటపుడు ఉన్నతాధికారికి లేఖలు రాశామన్నారు. తమ లేఖ వల్ల ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయలేదని, ఎక్కువ జీతం వస్తుందని ప్రైవేట్ ఉద్యోగం చూసుకున్నాడన్నారు. గత నెల 11వ తేదీన తాను సీఎస్ కు లేఖ రాశానని, ఇపుడు కొత్తగా రాసింద కాదన్నారు. అపుడే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేస్తున్నారని తెలిసి.. ఇలాంటి నిర్లక్ష్యపు అధికారులపై విచారణ జరగాలని రాశానన్నారు. తాను తప్పుచేయనని, నిజాయితీగా ఉంటానని.. ఏ అంశంపై నైనా చర్చకు సిద్దమన్నారు. తాను ఏడుసార్లు గెలిచానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా ఉన్నానన్నారు. తాను నిజాయితీగా ఉంటానని, ఎపుడూ అబద్దం చెప్పనని, అబద్దపు హామీలు ఇవ్వనన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయని..

జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయని, సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారాలతో సంబంధం లేని ముఖ్యమంత్రి పైన, ఆయన కుటుంబం పైన, తన కుటుంబం పైనా చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. లిక్కర్ దందాకు పేటెంట్ కల్వకుంట్ల కుటుంబమేనని, ఢిల్లీలో అరెప్టయి.. బిజెపి దగ్గర మోకరిల్లి ఏం చేసి వచ్చారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ ల ఆర్ధిక స్థితి ఏంటి.. ఇపుడు ఏంటి అన్న విషయం ప్రజలకు తెలుసునని, చెప్పాలంటే వందలున్నాయని.. విధులపై నిర్లక్ష్యం వహించేవారిని ప్రశ్నిస్తే అడ్డగోలు ఆరోపణలు చేస్తే మంచిదికాదన్నారు. తాను నిజాయితీగా ఉంటాను కాబట్టి పిచ్చి ఆరోపణలకు బాధపడుతున్నానని, ఇలాంటి ఆరోపణలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Latest