హైదరాబాద్,మహా : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై యద్రాద్రి భువనగిరికి చెందిన వ్యక్తి ఏసీబీ,ఇన్ కమ్ ట్యాక్స్ అధికారలకు ఫిర్యాదు చేశాడు. అలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీనామి పేరు మీద 100 ఏకరాలు ఉందని విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఎన్నికల సమయంలో తన పేరు మీద 43 ఏకరాల భూమి రూ.3కోట్లు విలువ చేస్తుందని ఆఫడవిట్ లో పేర్కోన్నట్లు వివరించారు. ఎమ్మెల్యే భార్య బీర్ల అనిత , బీనామీల పేరుమీద సుమారు 100ఏకరాలు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.200కోట్లు ఉంటుందని ఎమ్మెల్యేగా గెలుపోందిన అనతికాలంలో ఎలా ఆస్తులు పెరిగాయో విచారణ చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై చట్ట ప్రకారం దర్యాప్తు చేసి శిక్షించాలని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆస్తుల వివరాలు అందించేందకు, దర్యాప్తుకు సహకరిస్తానని ఫిర్యాదులో తెలిపారు
Post Views: 15







