Mahaa Daily Exclusive

  2028లో మళ్లీ పోటీ చేస్తా-సీఎం సిద్ధరామయ్య

Share

  • 2028లో మళ్లీ పోటీ చేస్తా
  • పార్టీ పటిష్టానికే ఈ నిర్ఱయం
  • …రెండున్నరేళ్ల తరువాతే విస్తరణ- సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు, మహా
కర్నాటక అసెంబ్లీకి 2028 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పార్టీ మరింతగా పటిష్టం చేసేందుకు పోటీ చేయాలని స్నేహితులు చేసిన సూచనతో 2028 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మూడు నాలుగు నెలల క్రితం కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఢిల్లీ పెద్దలు సూచించారని, అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి రెండున్నర ఏళ్ల సందర్బం పురస్కరించుకుని విస్తరించనున్నట్లు వారికి తెలియచేశానన్నారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు ఆదేశిస్తే అమలు చేయడం తన బాధ్యత అన్నారు. పార్టీ నాయకత్వం సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తే మరొకరికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయనని, శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, కన్నడిగులకు రాష్ట్రంలోనే ఉండి సేవలు చేస్తానన్నారు. రెండు మూడు రోజుల క్రితం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ చరమాంకంలో ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తన తండ్రి సైద్ధాంతిక వారసుడిగా పబ్లిక్ వర్క్స్ మినిష్టర్ సతీష్ జర్కిహోలి ఎంపిక కావచ్చునని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్విస్టు చేశారని, రాజకీయ వారసుడు అని చెప్పలేదని సైద్ధాంతిక వారసుడు అని మాత్రమే చెప్పారని సిద్ధరామయ్య వివరించారు