Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్‌లో పోటీ మజ్లిస్‌- భాజపా మధ్యే బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

Share

హైదరాబాద్‌, మహా : రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌-బీజేపీమధ్యే పోటీ ఉంటుంది. ప్రజలు బీజేపీకి ఓటేయకుంటే మజ్లిస్‌ సీట్లు 8 అవుతాయి. ఆ పార్టీని ఆపాలంటే బీజేపీని గెలిపించాలి. జూబ్లీహిల్స్‌కు కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి చేసిందేమీ లేదు. బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు’’ అని రామచందర్‌రావు అన్నారు