Mahaa Daily Exclusive

  ఆటోలో కేటీఆర్‌ ఆటోడ్రైవర్లు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్

Share

హైదరాబాద్, మహా
తెలంగాణలోని ఆరు లక్షలకుపైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌కు సోమవారం ఆయన ఆటోలో వచ్చారు. తాను వచ్చిన మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు కేటీఆర్‌ చెప్పారు. ఆటో డ్రైవర్లకు అన్నీ చేస్తామని రాహుల్ గాంధీ నాడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మస్రత్ అలీ తనకున్న రెండు ఆటోలు అమ్మి.. ఆయన ప్రస్తుతం కిరాయి ఆటో నడుపుతున్నట్లు చెప్పారని కేటీఆర్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్న 161మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Latest