- పత్తి రైతుల కష్టాలు తీర్చండి
- తేమశాతం తగ్గిం చండి
- పత్తి మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోండి
- సీసీఐ సీఎండీకి మంత్రి కోమటిరెడ్డి వినతి
ముంబై, మహా : రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేష న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. వారిద్దరి మధ్య సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎంఎస్ పీ సేకరణ, రైతులకు తక్షణ ఉపశమనం అందించాల్సిన అవసరాన్ని మంత్రి సీసీఐ చైర్మన్ కు వివరించారు. తెలంగాణతో సహా దక్షిణ భారత రాష్ట్రాలలో అధిక తేమ స్థాయిలు ఉన్న కారణంగా, ప్రస్తుత ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ) నిబంధనల ప్రకారం నిర్దేశించిన 8 – 12% తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్నాయని, అందుకే, రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస పీ)ని సవరించాలని, పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రై తులను కాపాడాలని కోరారు. తెగులు నష్టం మరియు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ అందించాలన్నారు.
గత సీజన్ లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చే యాలని, మార్కెట్ యార్డ్ స్థాయిలో ఆధునిక తేమ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగి, వస్త్ర సరఫరా గొలుసు బలోపేతమయ్యేలా సీసీఐ చైర్మన్ వ్యక్తిగత శ్రద్ధ వహించాలని మంత్రి కోమటిరెడ్డి అభ్యర్థించారు. మంత్రి తన విజ్ఞప్తిలో పేర్కొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం తో చర్చించి, సానుకూలంగా పరిష్కరిస్తామని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఉన్నారు.







