విజయనగరం జిల్లా, మహా :
ఆంధ్ర రాష్ట్రంలో “ముoథా తుఫాను”కారణంగా అధిక వర్షాలు వలన బొబ్బిలి పట్టణం 14వ, వార్డుకు చెందిన టెక్కలి రమణమ్మ అనే మహిళకు సోమవారం రాత్రి సుమారు 7:00 గంటల ప్రాంతంలో ఇంటి పైపెచ్చు ఊడి పడి తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీ నాయన మంగళవారం ఉదయం టెక్కలి రమణమ్మను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతర వర్షాలు కారణంగా పాత భవనాల్లో నివసించే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని బొబ్బిలి పట్టణ ప్రజలందరినీ కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 24







