Mahaa Daily Exclusive

  ముoథా తుఫాన్ వల్ల ముందస్తు క్షేత్రస్థాయి పర్యటన.. మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి..

Share

విజయనగరం జిల్లా, మహ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ముoథా తుఫాన్ దృశ్య ముందస్తు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా, మంగళవారం ఉదయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, పర్యావరణ మరియు ఇతర సిబ్బందితో భోజరాజపురం ప్రధాని నీటి సరఫరా కేంద్రాన్ని సందర్శించారు.
భోజరాజపురం ప్రధాన నీటి సరఫరా కేంద్రం వద్ద ఇన్ఫిలట్లురేషన్ బావులను పరిశీలించారు. క్లోరేషన్ లెవెల్స్ ను పరిశీలించారు.ఇక అనంతరం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగురు వీధి-రెడ్డిక వీధి ఏరియాలో జరుగుతున్న మంచినీటి సరఫరాను పరిశీలించి సురక్షితమైన నీటి సరఫరా జరుగుతుంద లేదా అని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక అనంతరం. బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన కోరాడ వీధి స్మశాన వాటిక వద్ద ఉన్న మెయిన్ అవుట్ లె పాయింట్ ను క్లియర్ చేయించడానికి స్వయంగా పర్యవేక్షించారు. అలాగే బొబ్బిలి మున్సిపాలిటీ చెందిన ఇందిరమ్మ కాలనీలో వాటర్ స్ట్రాగ్నేషన్ ఏరియాలను పరిశీలించి జెసిబి తో క్లియర్ చేయించారు. మరలా నీరు నిలిచిపోయిన వెంటనే క్లియర్ చేసే విధంగా జెసిబి ని అక్కడే ఉంచాలని ఆదేశించారు.
ముoథా తుఫాన్ ప్రభావం తగ్గేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Latest