Mahaa Daily Exclusive

  ఆరు గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్

Share

  • ఆరు గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతికి కేరాఫ్
  • బీజేపీకో జితావో.. జూబ్లీహిల్స్ కో బ‌చావో
  • జూబ్లీహిల్స్ ప్ర‌చారంలో ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: భ‌విష్య‌త్ అభివృద్ధి కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకే ఓటేయాల‌ని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో ఎంపీ డీకే అరుణ క్యాంపెయినింగ్ నిర్వహించారు. మొదట డ‌ప్పు చ‌ప్పుళ్లు, జై బీజేపీ నినాదాల‌తో గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు స్థానిక బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, దమ్ముంటే జనాల్లోకి రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కాలం చెల్లిన‌ట్లే.. గ‌త ప‌దేళ్లు అధికారం ఇస్తే బీఆరెస్ చేసిందేమీ లేదు.. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం దోచుకోవడ‌మే ప‌నిగా పెట్టుకుందన్నారు. ప్ర‌జ‌ల్ని దోచుకుని మ‌భ్య‌పెడుత‌న్న కాంగ్రెస్‌, బీఆరెస్ ల‌కు ఓట్ల‌డిగే హ‌క్కేలేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల అవినీతి అంతం జూబ్లీహిల్స్ నుంచే మొద‌లు పెడ‌దామని కామెంట్స్ చేశారు. బీజేపీ అభ్య‌ర్థిపై అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయన్నారు. ‘మైనార్టీలు ఓట్లుంటే.. కాంగ్రెస్‌కు క‌లిసొచ్చిన‌ట్లేనా..? ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు.. చెప్పింద‌ల్లా న‌మ్మే ప‌రిస్థితి లేదు. మీరేం చేయ‌లేర‌ని వారికీ అర్థ‌మైంది. జూబ్లీహిల్స్ లో హిందువులంతా ఏక‌మ‌వ్వాల్సిన స‌మ‌యంఆస‌న్న‌మైంది. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపును ఆప‌లేరు. కాంగ్రెస్ అభ్య‌ర్థి గురించి అందిరికీ తెలిసిందే. బీఆరెస్ కు ఓటేసినా ఫ‌లిత‌మే లేదు. అందుకే జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లారా జ‌ర సోచో.. బీజేపీకో జితావో.. జూబ్లీహిల్స్ కో బ‌చావో’ అంటూ వ్యాఖ్యానించారు.

రొట్టెలు కాల్చిన డీకే అరుణ‌..
జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో డీకే అరుణ‌ త‌న‌దైన మార్క్ కనబరిచారు. బీజేపీ నాయ‌కురాలు బండారు విజ‌య‌ల‌క్ష్మీ, స్థానిక బీజేపీ ముఖ్య‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అంద‌రి దృష్టిని ఆకర్షించేలా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మయ్యారు. ప్ర‌చారంలో భాగంగా జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ లోని రోడ్డుపై జొన్న రొట్టెలు అమ్ముతున్న మ‌హిళ‌తో మాటామంతి చేశారు. స్వ‌యంగా రొట్టెలు కాల్చి బీజేపీ అభ్య‌ర్థి దీప‌క్ రెడ్డికి ఓటేయాల‌ని అభ్యర్ధించారు

Latest