Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్

Share

సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్
ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే నిర్ణయం
ఇద్దరు మంత్రులకు ఒక్కో డివిజన్ బాధ్యతలు

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో తన ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొననున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించడానికి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

మంత్రులు డివిజన్ల వారీగా..
రహమత్ నగర్ డివిజన్ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బోరబండ డివిజన్ – సీతక్క, మల్లు రవి,
వెంగల్ రావు నగర్ డివిజన్‌- తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు,
సోమాజిగూడ డివిజన్‌- శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్
షేక్ పేట డివిజన్‌- కొండా సురేఖ, వివేక్
ఎర్రగడ్డ డివిజన్‌- దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణరావు
యూసఫ్ గూడ డివిజన్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

సీఎం సైతం ప్రచారానికి..
ఉప ఎన్నిక కైవసం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల 31 వ తేదీ ఉదయం 7గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్‌లో రాత్రి 8 గంటలకు సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఏడు గంటలకు వెంగళరావునగర్ సోమాజిగూడలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్ పేట 1డివిజన్ లో, రాత్రి రహమత్ నగర్ లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్ పేట 2లో, సాయంత్రం యూసఫ్ గూడలో, 8వ తేదీన ఆరు డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్ పేటలో ఉదయం 10గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Latest