Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో వ్యవస్థాపకుల కోసం ‘ఫౌండర్స్ లైబ్రరీ’ ప్రారంభం

Share

హైదరాబాద్ : తాను రెగ్యులర్ సిలబస్‌తో పాటు సైకాలజీ వంటి అసలైన పుస్తకాలను చదవడం వల్లే కేవలం సంవత్సరంలోనే ఐఏఎస్ పరీక్షలో విజయం సాధించడం సులభమైందని ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. విద్యార్థులు అనుసంధానం కావడానికి ఒక ప్రత్యేక వేదికను అందించే లక్ష్యంతో బౌవర్ స్కూల్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ‘ఫౌండర్స్ లైబ్రరీ’ ‘బి కేఫ్’ లను ప్రారంభించిందని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరై, ఫౌండర్స్ లైబ్రరీని లాంఛనంగా ప్రారంభించారు. పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పుస్తక పఠనం కలిగిన ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలు పంచుకోవడానికి అనువైన వేదికను ఫౌండర్స్ లైబ్రరీ అని తెలిపారు. హైదరాబాద్‌లోని వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, విద్యార్థులు చదవడానికి, ఆలోచించడానికి, అనుసంధానం కావడానికి ఒక ప్రత్యేక వేదికను అందించే లక్ష్యంతో బౌవర్ స్కూల్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ‘ఫౌండర్స్ లైబ్రరీ’ ‘బి కేఫ్’ లను ప్రారంభించించినట్లు నిర్వహకులు తెలిపారు. “ద బుక్స్ దట్ బిల్ట్ అస్” “లెర్నింగ్ బియాండ్ క్లాస్‌రూమ్స్” అనే అంశాలపై రెండు ఆసక్తికరమైన ప్యానెల్ చర్చలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఐఎస్‌బి మాజీ డీన్ అజిత్ రంగనేకర్, ఐసిఎఫ్‌ఎఐ ముఖ్య విద్యాధికారి ప్రొఫెసర్ నాగేంద్ర, టి-హబ్ సలహాదారు మహంకాళి శ్రీనివాస రావు, ఐఐఐటీ-హెచ్ ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు

Latest