- రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాతో చెప్తా
- మునుగోడు అభివృద్ధికే నా ప్రతి అడుగు
- అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, మహా : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేనే స్వ యంగా ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేం ద్రంలోని చెరువులను గురువారం పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నానని కావాలని బీఆర్ఎస్ వాళ్లతో పాటు మా పార్టీ లోని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, నాపై సోషల్ మీడి యాలో వచ్చే దుష్ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు రూ. 500 కోట్ల తో ప్రణాళిక రూపూదిద్దబోతుందని వెల్లడించారు.
చౌటుప్పల్ చెరువు వల్ల ఏలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపు రం, లక్కారం వద్ద వరద నీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని గుర్తు చేశారు. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచా రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలెవరూ దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానన్నారు. నా ప్రతీ అడుగు మునుగోడు అభివృద్దికే తప్ప, మరో ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు







