Mahaa Daily Exclusive

  వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నది: పొన్నం

Share

  • రైతులను ఆదుకుంటాం
  • వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నది: పొన్నం
  • సిద్దిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

సిద్దిపేట, మహా: రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నది.. కొట్టుకుపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని తెలిపారు. వర్షాలకు రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని.. హుస్నాబాద్‌లో పర్యటించాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశామన్నారు. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలని.. ఇక్కడ పర్యటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని బాధ్యతగా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్రజల మధ్యే ఉండి నష్టపోయిన పంటలను అంచనా వేయాలని, భారీ వరదలకు జరిగిన నష్టాన్ని మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు

Latest