Mahaa Daily Exclusive

  2-కే రన్ లో పాల్గొన్న డిఎస్పి రవీందర్ రెడ్డితో పాటు అధికారులు, విద్యార్థులు

Share

  • రన్ ఫర్ యూనిటీ..
  • దేశ ఐక్యతకు ప్రతీక..
  • మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2-కే రన్..

మణుగూరు, మహా :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ 2-కే రన్ సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రన్ దేశ ఐక్యత, సోదరభావం, సమగ్రతను ప్రతిబింబిస్తుందన్నారు. దేశ నిర్మాణానికి ఉక్కు మనిషి పటేల్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా రన్ లో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. రన్‌లో డీఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు సీఐ నాగబాబు, ఎస్సై నగేష్, ఎస్సై శ్రావణ్ కుమార్, ఇ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై రాజేష్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎక్సైజ్ సీఐ రాజి రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు పిండిగ వెంకట్, ఎం. శ్రీనివాస్, చందు, విజయ్, శ్రీ విద్య, కృష్ణవేణి కళాశాలల యాజమాన్యం పుచ్చకాయల శంకర్, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశ ఐక్యతకు తమ మద్దతు తెలిపారు

Latest