Mahaa Daily Exclusive

  నకిలీ నోట్లలో రూ. 500 నోట్లే అదికం

Share

  • నకిలీ నోట్లలో రూ. 500 నోట్లే అదికం
  • డేటా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు

హైదరాబాద్, మహా : రోజురోజుకు దేశంలో నకిలీ నోట్ల చెలామణి ఎక్కువవుతున్నాయి. ఇందులో ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య 1,17,722 కు పెరిగింది. గత సంవత్సరాల్లో గుర్తించిన సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 91,110 నకిలీ నోట్లు గుర్తించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85,711 నకిలీ నోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు గుర్తించడం జరిగిందని నివేదికలో పేర్కొంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో అత్యంత ఎక్కువగా చెలామణి అవుతున్న నోట్లలో ఎక్కువగా 500రూపాయల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత, నకిలీ రూ.500 నోట్ల సంఖ్య పెరిగింది. వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు నకిలీ రూ.2,000 నోట్ల ప్రసరణ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9,806గా ఉన్న నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26,035కి పెరిగింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3,508కి బాగా తగ్గింది. నకిలీ నోట్లు తయారు చేస్తున్న కేటుగాళ్లు తమ దృష్టిని చలామణిలో లేని రూ.2,000 నోట్ల నుండి విస్తృతంగా చెలామణిలోకి వచ్చిన రూ.500 నోట్ల వైపు మళ్లించారని ఈ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నకిలీ నోట్ల చెలామణిని నియంత్రించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీఐ) సహకారంతో కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం, నకిలీల నుండి ముందుండడానికి కొత్త డిజైన్లు, భద్రతా మెరుగుదలలను ప్రవేశపెట్టడం నిరంతర ప్రక్రియ అని మంత్రిత్వ శాఖ తెలిపింది

Latest