కర్నూలు, మహా : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు అందడంతో కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జాబితాలో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతోపాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు. ఈ కర్నూలు బస్సు ప్రమాదం బెల్టు షాపులు, కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Post Views: 31






