- ఈ పాస్ ముద్ర పెట్టకున్న జాతీయ ప్రజా పంపిణీ సరుకుల సరఫరా
- గోడౌన్ ఇంచార్జీకి అంత ప్రేమేంటో…ఏడు కొండల వాడికే ఎరుక
మంచిర్యాల, మహా : జైపూర్ మండలం, నరసింగాపూర్ రేషన్ డీలర్ శ్రీనివాస్ నివాసంలో 100 కింటోల్ల బియ్యం..!? ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం సంబంధిత సివిల్ సప్లై అధికారులకు తెలిసిన పోనీ మనవాడే కదా అని ఉర్కుండి పోయినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుండి మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల వరకు రేషన్ డీలర్ శీనన్నకు వీరాభిమానులు ఉన్నట్లు కథనాలు వెళ్లడవుతున్నాయి. అందుకు నజరానాగా అధికారులకు సదరు (డీలర్) ఆసామికి సహకరించినందుకుగాను నెలకో కొంత కాసుల వర్షాలు కురుస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…. ఈ మధ్య మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామ శివారులో తాటిపల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల పేరుతో సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ పరిశ్రమను దాదాపు 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లు సమాచారం. ఈ పరిశ్రమకు నరసింగపురం గ్రామం నుండి వడ్లను సేకరించినట్లు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ప్రభుత్వ ప్రజాధనం ఒక కోటి 39 లక్షల రూపాయల దుర్వినియోగం చేశాడని పేర్కొంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానితో జైపూర్ పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ చర్య వల్ల సంబంధిత రేషన్ డీలర్ శ్రీను కుటుంబం మొత్తం కనబడకుంటా పోయారు.
అక్టోబర్ 29 నాడు రేషన్ బియ్యం సరఫరా
మంచిర్యాల పౌర సంబంధాల శాఖ కార్యాలయం గోడౌన్ ఇంచార్జ్ నరసింగ పూర్ గ్రామవాసి తాటిపల్లి శ్రీనివాస్ నివాసానికి అక్టోబర్ 29 నాడు (జాతీయ ప్రజా పంపిణీ పథకం) రేషన్ బియ్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సదరు రేషన్ డీలర్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల శాఖ గోడౌన్ ఈపాస్ లో వేలిముద్ర పెట్టనప్పటికీ దాదాపు 100 కింటోళ్ల బియ్యాన్ని పంపించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గోడౌన్ ఇంచార్జీకి రేషన్ డీలర్ శ్రీనివాస్ పై అంత ప్రేమేంటో…ఏడు కొండల వాడికే ఎరుక
చరవానికి అధికారి స్పందన కరువు
నర్సింగా పూర్ రేషన్ డీలర్ తనకు సరుకులు పంపాలని కార్యాలయానికి వెళ్లి చెప్పనప్పటికీ జిల్లా సివిల్ సప్లై అధికారులు నేరుగా ఇంటికి పంపించి బియ్యాన్ని డంపు చేయించిన అంశంపై వివరాలు తెలుసుకునేందుకు మంచిర్యాల గోడౌన్ ఇంచార్జ్ అమృత్ కుమార్ కు చరవాణి ద్వారా మహా దినపత్రిక పలుమార్లు సంప్రదించగా అధికారి స్పందించడం లేదు.
జిల్లా అధికారులు దృష్టి సారించాలి
ఈ అక్రమ బియ్యం నిలువపై సంబంధిత మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో డీలర్ శీను ది అందవేసిన చెయ్యని జిల్లావ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. ఇదివరకు సదరు వ్యక్తిపై ఏసీబీ రైడ్స్ జరిగినట్లు కథనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు చెందవలసిన 100 కింటోల్ల బియ్యం మాయమైతే ఎవరు బాధ్యత వహిస్తారో వేచి చూడాల్సిందే.







