నల్లగొండ, మహా : ప్రభుత్వం చేతకాని తనం ఓ వైపు, ప్రకృతి ప్రకోపం ఓ వైపు అన్నదాతలు పుట్టెడు దుఃఖంలో విలవిలలాడుతు న్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటు వ్యా ఖ్యలు చేశారు. జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విధారక దృశ్యాలే కనిపిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల భావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లా మంత్రులు అడ్డగోలు కమిషన్లు, అక్రమ సంపాదన మీదనే దృష్టి సారించారని ఆరోపించారు. విదేశీటూర్లల్లో జల్సాలు చేస్తు న్నారని, దోచుకోవడం మీదనే వారి దృష్టి అంతా అంటూ ధ్వజమెత్తా రు. రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి సాగిలపడ్డారని, మంత్రుల దుర్బుద్ధి కారణంగా మిల్లర్లు రైతులను పీక్కుతింటున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతుందని, పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలు అన్ని పక్క న పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని పత్తిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఏడిపిస్తున్నదని విమర్శించారు. యూరియా కొరతతో కొన్ని రోజులు ఏడిపించిన ప్రభుత్వం, ప్రస్తుతం ధాన్యం కొనక ఏడిపిస్తున్నదని, తుఫాన్ తో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలని, లేదంటే బీఆర్ఎస్ తరఫు న ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులు కూడా బయటికి వచ్చి మంత్రులను, ఎమ్మెల్యేలను వెంటపడి నిలదీయాలని పిలుపునిచ్చారు







