విజయనగరం జిల్లా.మహా
భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రత్యేకించి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానం ద్వారానే సాధ్యమయిందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావనకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పోరాట పటిమను, త్యాగ నిరతిని ,బొబ్బిలి పట్టణంలో ఉన్న కారుణ్య ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం నాడు స్మరించుకుంటు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జె సి రాజు మాట్లాడు తూ.. తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనితన ప్రాణాన్ని ఫణంగా పెట్టి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిపెట్టిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని అన్నారు. ఆయన పట్టుదల, దేశభక్తి, త్యాగ నిరతి నేటి పాలకులకు,యువతకు ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో జి సిహెచ్ జి శర్మ,ఎన్ రమేష్,కె రామ కృష్ణ ,ఏ చిన్నారావు, రాజు యుగంధర్, సోమేశ్ తదితరాలు పాల్గొన్నారు






