- సీఎం మార్పు ఉండదు
- సీఎం లేదా నేను చెబితేనే నమ్మాలి
- మరెవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
- డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ
కర్ణాటక, మహా: రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలందరూ ఐక్యతతో ఉన్నారని.. ప్రస్తుతానికి తమకు మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో నవంబరులో సీఎం మార్పు ఉండొచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఈ కథనాలను మరోసారి కొట్టిపడేశారు. దీనిపై ఏ విషయమైనా సీఎం లేదా తాను చెబితేనే నమ్మాలని..మరెవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని.. తప్పుడు వార్తలపై కాదని డీకే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన అనుబంధం ముందులాగానే కొనసాగుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో సీఎం మార్పు విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు







