హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో పి. సుదర్శన్ రెడ్డి.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించింది. ఇప్పటి నుంచి ఈ పథకాల అమలును సుదర్శన్ రెడ్డి సమీక్షించనున్నారు. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆరు గ్యారంటీల అమలును ఆయన పర్యవేక్షించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు
Post Views: 57








